బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ చివరిగా జీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్ మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.జూలైలో తన కొత్త సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది .ఇక షారుఖ్ తన సినిమాలతోనే కాదు సేవాగుణంతోను అభిమానుల మనసులు దోచుకుంటున్నాడు. దేశ వ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న షారూఖ్ ఇటీవల తన మేకప్ మేన్ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. ముంబైలోని గ్రాండ్ హయత్‌లో ఈ పెళ్ళి వేడుక జరిగింది. స్టేజ్‌పైకి వచ్చీ మరి నూతన జంటని అభినందించాడు షారూఖ్. తన పెళ్ళిలో షారూఖ్‌ని చూసిన మేకప్ మేన్ శ్రీకియాన్ తెగ సంబరపడిపోతూ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతుంది.
previous post
రోజాపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు