telugu navyamedia
తెలంగాణ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

మగువలకు గుడ్ న్యూస్… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. దీంతో క్రమంగా బంగారం ధర తగ్గుతూ రావడం పసిడి ప్రేమికులకు కాస్త‌ ఊరట.

మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధరల్లో ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా ఆదివారం మాత్రం దేశీయంగా పరిశీలిస్తే పసిడి ధరలు నిలకడగా ఉండగా, వివిధ ప్రధాన నగరాల్లో మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది.

Gold rate today in Hyderabad, Bangalore, Kerala, Visakhapatnam on 12 April  2021

తాజాగా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటల సమయానికి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 కు తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,110గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గుదలతో రూ.44,100కు దిగొచ్చింది. వెండి ధర కూడా పడిపోయింది. రూ.1100 దిగొచ్చింది.

అలాగే ఈరోజు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ. 68,000 కు చేరుకుంది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి చాన్స్.

Related posts