sensor-difficulties-for-shilavathi

శీలవతికి సెన్సార్ కష్టాలు…

13
షకీలా 250 వ చిత్రం “శీలావతి” కి సెన్సార్ కష్టాలు వెంటాదుతున్నాయి. “శీలావతి” చిత్రం గత 10 రోజుల ముందు సెన్సార్ కు దరఖాస్తు చెయ్యడం జరిగింది. సెన్సార్ ఆఫీస్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నిర్మాత సెన్సార్ అధికారులను కలిశారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కు ఉన్న ట్యాగ్ లైన్ అభ్యంతరకరంగా ఉంది తీసేయండి అని  సెన్సార్ అధికారులు చెప్పడంతో ట్యాగ్ లైన్ లో ఎలాంటి అభ్యంతరం ఎమ్ లేదు ఇది ఒక త్రిల్లర్ చిత్రం కావడంతో ఫియర్ అని మీనింగ్ ఉండేలాగా ట్యాగ్ లైన్ పెట్టాం అని నిర్మాత చెప్పడంతో ఫర్దర్ గా టైటిల్ అభ్యంతరకరంగానే ఉందని, “శీలావతి” అనే టైటిల్ తీసేస్తేనే మేము సినిమా చూస్తాం అని సెన్సార్ బోర్డు అధికారులు చెప్పారు.  
సినిమా చుసిన తరువాత సినిమాలో ఉన్న కంటెంట్ అభ్యంతరకరంగా ఉంటే  ఎన్ని సన్నివేశాలు తొలగించాలో, ఎన్ని డైలాగులు తీసేయ్యాలో ఇవ్వన్ని సెన్సార్ గైడ్ లైన్స్ ప్రకారం సినిమా చుసిన సెన్సార్ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అసలు సినిమానే చూడకుండా ఈ టైటిల్ అభ్యంతరకరంగా ఉందనడం ఎంత వరకు న్యాయం అని నిర్మాత ప్రశ్నించారు. ఈ టైటిల్ ఇంతక ముందే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టరై ఉంది, గతంలో షకీలా నటించిన ఒక డబింగ్ చిత్రం కు కూడా ఇదే టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాంటపుడు కొత్తగా ఈ సినిమ టైటిల్ కు వచ్చిన అభ్యంత్రం ఏంటని చిత్ర నిర్మాత, అలాగే చిత్ర యూనిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.