telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షా అందుకే సెలక్ట్ కాలేదా..?

టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. కానీ ఈ జట్టులో యువ ఓపెనర్ పృథ్వీషాకు చోటు దక్కలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పృథ్వీ షాకు మళ్లీ టీమిండియాలో చోటు దక్కుతుందని అంతా భావించినా.. అతనికి సెలక్టర్లు మొండిచెయ్యే చూపించారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ నలుగురు ఓపెనర్లతో పాటు బ్యాకప్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. అయితే పృథ్వీ షాకు సెలెక్టర్ల నుంచి ఇది వేకప్ కాల్ అని, అతని అధిక బరువే జట్టులో చోటు దక్కకుండా చేసిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియాలో మళ్లీ చోటు దక్కాలంటే పృథ్వీ షా బరువు తగ్గాల్సిందేనని అతనికి సెలెక్టర్లు సూచించినట్లు ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఈ విషయంలో అతను రిషభ్ పంత్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. పంత్ కూడా జట్టులో నుంచి తీసేసిన తర్వాతే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడని, బరువు తగ్గి ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాడని ఉదహారణగా పేర్కొన్నారు. ‘21 ఏళ్ల పృథ్వీ షా మైదానంలో చాలా నెమ్మదిగా కదులుతుంటాడు. అతను కొంచెం బరువు తగ్గాలి. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డర్‌గా అతను చేసిన తప్పిదాలను సవరించుకోవాలి. ఆ పర్యటన అనంతరం అతను చాలా కష్టపడుతున్నాడు.

Related posts