telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేంద్రం కీలక నిర్ణయం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో చంద్రబాబుకు 12+12 ఎన్ఎస్‌జీ కమెండోలతో భద్రతను పెంచుతూ ఎన్ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.

నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

ఇదిలాఉంటే.. కుప్పంలో పొలిటికల్ కుస్తీ నడుస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్రస్థాయికి చేరింది. బుధవారం నుంచి మొదలైన ఉద్రిక్తత ఏపీ రాజకీయాలను ఊపేస్తున్నాయి. చంద్రబాబు మూడు రోజుల పర్యటనల నేపథ్యంలో.. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చించేశారు గుర్తుతెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షో నిర్వహించబోతోన్న మార్గంలోనే ఇది చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు చంద్రబాబు రోడ్ షో కొనసాగే మార్గంలో భద్రత పెంచారు.

 

Related posts