ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రెడ్‌ఫోర్ట్ వద్ద మధ్యామ్నం 12 గంటలకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అక్కడ పోలీసులు 144వ సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో భారీ బ్యారికేడ్లు పెట్టారు. దీంతో నగరమంతా ట్రాఫిక్ జామైంది.
ఢిల్లీ-గూర్గావ్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రవాణా ఆంక్షలు విధించారు. ఢిల్లీ మెట్రోలో ఏడు స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. జామియా మిలియా ఇస్లామియా, జసోలా విహార్ షాహీన్ భాగ్, మునిర్‌కా, లాల్ క్విలా, జామా మసీద్, చాందినీ చౌక్, విశ్వవిద్యాలయ స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది ప్రజారాజ్యమా.. నియంతల ప్రభుత్వమా?: టీడీపీ నేత గోరంట్ల