telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

రూ.25,000 జీతం ఉంటే… రూ.10 లక్షలు లోన్… ఎస్‌బీఐలో

sbi logo

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో రుణం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవచ్చు. ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఎన్ఆర్ఐలు ఎస్‌బీఐ ప్రాపర్టీ లోన్ తీసుకోవచ్చు. నెలకు నికర వేతనం కనీసం రూ.25,000 ఉండాలి. అప్పుడే ఈ లోన్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. 70 ఏళ్ల వయసులోపు వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ప్రాపర్టీ లోన్ కింద కనీసం రూ.10 లక్షలు పొందొచ్చు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ ఆధారంగా గరిష్టంగా రూ.5 కోట్ల వరకు రుణం రావొచ్చు. ప్రాపర్టీ వ్యాల్యూ ప్రాతిపదికన రుణ మొత్తం ఎంతనేది నిర్ణయమౌతుంది. స్టేట్ బ్యాంక్ రూ.కోటి వరకు రుణంపై ఏడాది ఎంసీఎల్ఆర్‌తోపాటు 1.6 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అదే రూ.కోటి నుంచి రూ.2 కోట్ల రుణ మొత్తంపై ఏడాది ఎంసీఎల్ఆర్‌కు అదనంగా 2.1 శాతం వడ్డీ చెల్లించాలి. అదే రూ.2 నుంచి 5 కోట్ల మధ్యలో రుణ మొత్తంపై వడ్డీ రేటు ఏడాది ఎంసీఎల్ఆర్‌కు 2.5 శాతం అదనంగా ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 15 ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ రెగ్యులర్ ఆదాయం, ప్రాపర్టీ వ్యాల్యూ సహా పలు అంశాల ప్రాతిపదికన లోన్ టెన్యూర్ నిర్ణయిస్తారు. ఎస్‌బీఐ ప్రాపర్టీ రుణాలపై లోన్ మొత్తంలో 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. దీనికి ఇతర సర్వీస్ చార్జీలు అదనం.

Related posts