telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇమ్రాన్‌ పై సౌదీ యువరాజు ఫైర్ .. విమానం వెనక్కు పంపించాలి

imran pakistan pm

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ పై సౌదీ యువరాజు మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మండిపడ్డారు. సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఆయనకు సమకూర్చిన ప్రైవేటు విమానాన్ని తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందిగా మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కోరారు. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లి (యుఎన్‌జిఎ) లో ఇమ్రాన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలపట్ల సౌదీ యువరాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుఎన్‌జిఎలో ఇమ్రాన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలపట్ల సౌదీ యువరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పాకిస్తాన్‌కు చెందిన వారపత్రిక ఒకటి వార్త ప్రచురించింది. సౌదీ అమెరికానుంచి యుఎన్‌జిఎ సమావేశాలకు వెళుతున్న సమయంలో సౌదీ యువరాజు తన ప్రైవేటు విమానాన్ని ఇమ్రాన్‌ఖానుకు సమకూర్చారు.

Related posts