sara sisters nude bathtub1

ఆర్యా పొరపాటు…సారా దిద్దుబాటు…

86

బాలీవుడ్ లో కూడా బుల్లి తెరకు అతిపెద్ద హిట్ గా మారుమ్రోగింది షో బిగ్ బాస్. ఈ షోలో పాల్గొన్న వారికి వచ్చిన అభిమానుల ఆదరాభిమానాలు కూడా అంతా ఇంతా కాదు. ఒక్క సారి ఈ షోలో పాల్గొంటే ఓ స్టార్ అయిపోయినట్టే. అలాగే ఒకసారి ఈ షోలో పాల్గొన్న సారా ఖాన్ తన ఇమేజ్ తగ్గిందని బావించిందేమో మరో సారి అభిమానులను సంపాయించుకోడానికి కొత్త పుంతలు తొక్కింది.

ఇంతకీ ఏమి చేసిందని అంటే, ఆమె బాత్ టబ్ లో నగ్నంగా ఉన్న వీడియో ను విడుదల చేసింది. ఆ వీడియో సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంది. మరి ఆ వీడియో ఆమె చేసిందా, లేక వేరే ఏమైనా జరిగిందా అంటే ఇంతకముందు కూడా ఆమె ఇలాంటివి అనేక వివాదాలకు స్వయంగా తెరలేపిన విషయాలు చుస్తే ఇప్పుడు కూడా ఏదొఒక ఉదేశ్యంతోనే ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలోకి విడుదల చేసినట్టుగా ఉంది.

జరిగిన విషయానికి వస్తే సారా మరియు ఆమె సోదరి ఆర్యా ఖాన్ తమ సెలవులను శ్రీలంకలో గడుపుతున్నారు. ఆర్యా మరియు ఆమె సోదరి ఇద్దరు బాత్ టబ్ లో స్నానం చేసుటనుండగా వీడియో తీసి దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మళ్ళీ ఏమనుకుందో ఆ వీడియోను తీసేసింది, కానీ అప్పటికే అది అందరూ డౌన్ లోడ్ చేయటం ప్రపంచమంతా పాకటం అయిపోయింది. ఈ మధ్య క్రేజ్ కోసం ఎవరైనా ఎంతటి పనైనా చేస్తున్నారన్నదానికి ఇదొక మచ్చుతునక.

sara sisters nude bathtub

సారా దీనిపై స్పందించి తాను కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నానని ఆ సమయంలో తన సోదరితో బాత్ టబ్ పంచుకోవటం తప్పేమిటని తన సోదరి చేసిన పిచ్చిపనికి చాలా పెద్దరికంతోటి పక్కదారి పట్టించడానికి తన వంతు ప్రయత్నం చేసింది.

మరి వీడియో గురించి ఏమిటని అడిగితే అది కూడా పొరపాటు వల్ల సోషల్ మీడియాలో కి వచ్చేసిందని చెప్పింది సారా, నిజమేలే పిల్లలు చేసిన తప్పులని అక్కడ ఉన్న పెద్దలెవరైనా కవర్ చేయటం తప్పదు, బహుశా సారా కూడా అదే చేసిందేమోలే.

sara sisters nude bathtub

ప్రచారం కోసమే ఇలా చేశారా అనే విషయమై సారా ను ప్రశించగా, అలాంటి అవసరం తనకేమి లేదని, వార్తలలోకి ఎక్కడానికి ఇటువంటి విలువలేని పనులను చేయనని స్పష్టం చేసింది.

ఏదిఏమైనా ఇటువంటివి ప్రముఖులు చేయటం వాటిని అభంశుభం తెలియని పిల్లలు అనుకరించి ప్రాణాలమీదకు తెచ్చుకోవటం కూడా చూస్తూనే ఉన్నాం, కనీసం ఇటువంటి చిన్న చిన్న పనులను అంతగా పేరున్న వారు మానుకుంటే బాగుంటుందని ఈ విషయం పై మహిళాసంఘాలు విమర్శిస్తున్నాయి.