telugu navyamedia
క్రీడలు వార్తలు

లక్ష్మణ్ ను అనరాని మాటలు అన్నాడు : మంజ్రేకర్

Snajay manjrekar cricketer

2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్​గా పనిచేసిన గ్రేగ్​ చాపెల్ భారత క్రికెట్ నాశనాన్ని కోరుకున్నాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక సందర్భంలో మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​పై కోపడ్డాడట! 2005 జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్​ మంజ్రేకర్ తాజాగా​ వెల్లడించాడు. తాజాగా ఈ విషయం పై మాట్లాడుతూ.. లక్ష్మణ్‌పై చాపెల్ అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. కోచ్ ప్రవర్తన పట్ల లక్ష్మణ్ షాక్‌కు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. ‘2005లో జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. గాయం కారణంగా వీవీఎస్ లక్ష్మణ్ మైదానం వీడాడు. ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చి చాపెల్ అనరాని మాటలు అన్నాడని మంజ్రేకర్ తెలిపాడు. ‘ఆ సమయంలో డ్రెస్సింగ్​ రూమ్​లో కాఫీ తాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను ఫీల్డ్​ నుంచి ఎందుకు వచ్చావంటూ చాపెల్ ప్రశ్నించాడు. గాయం కారణంగా మైదానం వీడానని, ఐస్ పెట్టుకోవడానికి వచ్చానని లక్ష్మణ్ బదులిచ్చాడు. అయినప్పటికీ.. అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా? అని గ్రెగ్​ చాపెల్ అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి సందర్భం వస్తే కానీ.. మైదానంలో నుంచి బయటకు రావద్దని మందలించాడు. దాంతో లక్ష్మణ్​ షాక్​కు గురయ్యాడు.’అని మంజ్రేకర్ పేర్కొన్నాడు

Related posts