సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రం `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్`. తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మే 7న విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది.
60 శాతం చిత్రీకరణ పూర్తయింది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగులోకి పరిచయమవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `తెనాలి రామకృష్ణ బీఏబీఎల్`కు సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
నటీనటులు:
సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్
సంస్థ: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్
సమర్పణ: ఇందుమతి శ్రీనివాసులు
కథ: టి. రాజసింహ
సంగీతం: సాయికార్తీక్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
మాటలు: నివాస్, భవానీ ప్రసాద్
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
కేసీఆర్ ఫైర్ బ్రాండ్… సినిమా వాళ్ళు భయపడట్లేదు : మంచు విష్ణు