Sampath Nehru arrested in Hyderabad

హైద్రాబాద్ లో సంపత్ నెహ్రు…అరెస్ట్

46
దేశంలో పలు నేరాలకు పాల్పడుతు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాఫియా డాన్  సంపత్ నెహ్రా ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ మియాపూర్ లో గత కొంత కాలంగా పోలీసుల కళ్ళు కప్పి తలదాచుకుంటున్నాడు. అయితే పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ ‘ఎస్ ఓ టి’, హైద్రాబాద్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో డాన్ సంపత్ ను పటుకున్నారు. 
 
Sampath Nehru arrested in Hyderabad
 
నిందితుడు నుండి తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. సంపత్ హర్యానాలో మాఫియా డాన్ గ ఎదిగాడు లెక్కలేని దారుణాలు చేశాడు, ఎవరికి కనపడకుండా  తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు.  మూడు రాష్ట్రాలలో దాదాపు 10 హత్య కేసులు, 3 హత్యాచార కేసులు, 10ల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపులు కేసులు నమోదైనట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు.
 
28 ఏళ్ళ సంపత్ నెహ్రా పై వివిధ రాష్ట్రలో 45 కేసులు ఉన్నాయి.  ఇతని స్వస్థలం రాజస్థాన్ లోని రాజకార్డ్ షార్ప్ షూటర్ గా పేరు పొందాడు సంపత్. సంపత్ ని పట్టించిన వాళ్లకి 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం అని హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులు ప్రకటించారు.  పక్కా ప్రణాళికతో దాడులు జరపడంతో 20 రోజుల క్రితం భాగ్యనగరానికి వచ్చిన సంపత్ దొరికిపోయాడు, ఎవరికి తెలియకుండా మీయపూర్ లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు హైద్రాబాద్ పోలీసుల సహకారంతో సంపత్ ను అదుపులోకి తీస్కున్నారు.