telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తీవ్ర పదజాలంతో విమర్శించారు… చాలా కాలం మర్చిపోలేకపోయా… : సమంత

Samantha

అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే కాకుండా గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను పలుసార్లు పోస్ట్ చేసింది. వివాహం తర్వాత మొదటిసారి కురచ దుస్తులు ధరించినపుడు ఎదురైన ట్రోలింగ్ గురించి సమంత తాజాగా మాట్లాడింది. “వివాహం జరిగిన తర్వాత తొలిసారి నేను కురచ దుస్తులు వేసుకున్నప్పుడు తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నా. కొందరు చాలా తీవ్ర పదజాలంతో విమర్శించారు. వాటిని చాలా కాలం మర్చిపోలేకపోయా. అయితే రెండోసారి అలాంటి ఫొటోలను పోస్ట్ చేసినపుడు ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు. ఆ తర్వాత ఇంకా తగ్గింది. మనం మొదటి అడుగు వేసినపుడే కష్టంగా ఉంటుందని అప్పుడు అర్థమైంది. తొలిసారి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు చాలా భయపడ్డా. ప్రజల ఆలోచనా ధోరణి మారాలనుకున్నా. ఆ మార్పు మొదలవడానికి నేను ఎంత చేయగలనో అంతా చేయాలనుకున్నా” అంటూ సమంత చెప్పింది.

Related posts