telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏప్రిల్‌లో సమంత ‘సూపర్ డిలక్స్’

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం “సూపర్ డీలక్స్”. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ “లీల” అనే శృంగార తారగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కన్పించనుండగా, సమంత కూడా రెండు సరికొత్త షేడ్స్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించాడు. అయితే…  వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ తెలుగు హక్కులను సిద్ధేశ్వర వైష్ణవి ఫిలిమ్స్ కు చెందిన పి. మధుబాబు చేజిక్కించుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంతతో పాటు విజయ్ సేతుపతికి ఇటీవల వచ్చిన క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని అతి త్వరలోనే దీనిని తెలుగులో డబ్ చేసి, ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు.

Related posts