telugu navyamedia
సినిమా వార్తలు

ఫోటో వైరల్… స్నేహితురాలి పెళ్ళిలో సమంత

Samnatha

అక్కినేని సమంత తన స్నేహితురాలి వివాహ వేడుకలో సందడి చేచేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ప్రియ మిత్రురాలి వివాహం అని తెలుపుతూ పెళ్లి కూతురు, ఆ వేడుకకు విచ్చేసిన ఇతర స్నేహితురాల్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సమంత. ఈ ఫొటోల్లో పెళ్లి కూతురు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా… సమంత, ఇతర స్నేహితురాల్లంతా నీలం రంగు దుస్తులు ధరించి ఆకట్టుకుంటున్నారు. ఎంతో సంతోషంగా తన స్నేహితులతో కలిసి సమంత ఎంజాయ్ చేస్తున్న సమంతను చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల సమంత, నాగ చైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళ రీమేక్ చిత్రం “96”లో కూడా నటించనుంది.

Related posts