అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమంత బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. మూడు గంటల మెగా ఎపిసోడ్‌ను ఆసాంతం నవ్వుతూ వినోదవంతంగా మలిచారు. ఇందుకు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, హైపర్ ఆదిలాంటి సెలబ్రిటీలు కూడా తమ వంతు సపోర్ట్ చేశారు. అలా దసరా ఎపిసోడ్‌ను బ్లాక్‌బస్టర్ చేసిన సమంతనే మిగతా వారాలకు కూడా హోస్ట్‌గా చేయమంటున్నారట. కాగా ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం నాగ్ ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడే 21 రోజులు ఉండబోతున్నారు. అందుకని బిగ్‌బాస్ బాధ్యతను కోడలుపిల్ల సామ్ భుజాలపైన వేశారు. ఈ క్రమంలో సామ్ చేసిన దసరా ఎపిసోడ్‌ను కలుపుకుని మొత్తంగా ఐదు ఎపిసోడ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ బిగ్‌బాస్ టీమ్ సామ్‌కు రూ.2.10 కోట్లు చెల్లిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ఓ సినిమాకు తీసుకోవాల్సినంత రెమ్యూనరేషన్‌ను బిగ్‌బాస్ చేస్తున్నందుకు వసూలు చేస్తోందన్నమాట. నాల్గో సీజన్ మొత్తానికి గానూ నాగార్జున ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటుంటే సమంత మాత్రం కేవలం మూడు వారాలకే రెండు కోట్ల పైచిలుకు అందుకోవడం విశేషం. మొత్తానికి సామ్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
previous post
next post
“సైరా” చేయలేకపోయినందుకు బాధపడ్డా… : పృథ్వీరాజ్