Salman khan's conspiracy to murder

కండల వీరుడి హత్యకు కుట్ర…

38

హైదరాబాద్ లో అరెస్టయిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసాడని అనుమానిస్తున్నారు, సంపత్ నెహ్రా ముంబయి వెళ్లి రెక్కీ కూడా చేశాడంటున్న హర్యానా పోలీసులు. హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా, కరడుగట్టిన నేరస్థుల జాబితాలో ఒకడైన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హర్యాణా పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

అయితే హర్యాణా పోలీసులు చేసిన విచారణలో కీలక విషయాలు బయట పడ్డాయి, అనేక హత్యలు చేసిన సంపత్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నెహ్రా గతంలో ముంబయికి వెళ్లి సల్మాన్ ఖాన్ ఇంటిని, అతని ఇంటికి వెళ్లే మార్గాలను ఫోటోలు తీసుకున్నట్లు, హత్య చేసిన తరువాత దేశం విడిచి వెళ్లేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

హర్యాణాలోని లారెస్ బిచ్మై ప్రధాన అనుచరుడైన సంపత్ నెహ్రా బిచ్మై వర్గానికి చెందిన వాడుగా, కృష్ణ జింకలను చంపినా కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన బయట ఉన్న సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ బిచ్మై వర్గం ఆ మధ్య బెదిరింపులకు పాల్పడింది. అందులో భాగంగానే నెహ్రాతో కలిసి సల్మాన్ హత్యకు కొందరు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.