telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆమె నా ఫేవరెట్‌ హీరోయిన్‌ : సల్మాన్ ఖాన్

salman

తాజాగా బాలీవుడ్‌ భామ లారాదత్తా కూడా వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతుంది. హండ్రెడ్‌ పేరుతో హాట్‌స్టార్‌లో ఇది ప్రసారం కాబోతుంది. దీనికి సంబంధించి అఫిషియల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీని గురించి బాలీవుడ్‌ స్టార్స్‌ చాలా మంది ప్రచారం చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన పార్టనర్‌కు సపోర్ట్‌గా ముందుకొచ్చాడు. ఈ సిరీస్‌లో లారాదత్తా, రింకు రాజ్‌గురూ కూల్‌గా కనిపిస్తోన్న పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. పార్ట్‌నర్‌ సినిమా నుంచి నా ఫేవరెట్‌ హీరోయిన్‌. నా ఫ్యాన్స్‌ అందరూ ఈ సిరీస్‌ చూడండి అంటూ అందులో పేర్కొన్నాడు. దీనికి తోడు హండ్రెడ్‌ ట్యాగ్‌లైన్‌ దో కిలాడీ ,ప్రాబ్లమ్‌ భారీ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా సల్మాన్‌ జత చేశాడు.ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో ఈ నెల 25 నుంచి ప్రసారం కాబోతుంది. ఈ పోస్ట్‌కి లారా దత్తా కూడా పార్టనర్‌ అని కామెంట్‌ పెట్టి సల్మాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. సల్మాన్, లారాదత్తా కలసి పార్టనర్‌ సినిమాలో నటించారు. సల్మాన్‌ ఫ్యాన్స్‌ కూడా పార్టనర్‌ సినిమాను గుర్తు తెచ్చుకొని రీఫ్రెష్‌ అవుతున్నారు.

 

View this post on Instagram

 

My fav heroine from Partner … she’s doing a show, pls go catch it … #DoKhiladiProblemBhaari #HotstarSpecialsHundred @larabhupathi

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Related posts