ఇప్పుడు బాలీవుడ్ ను ఊపేస్తున్న తాజా వార్త ఇదే. బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఐదు పదుల వయసు దాటినా పెళ్లి మాటెత్తకుండా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన పెళ్లిపై ఇది వరకు చాలా వార్తలే వినిపించాయి. సాధారణంగా సల్మాన్ తన సోదరి పిల్లలతో చాలా సరదాగా ఉంటారు. అయితే ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తనే తండ్రి కావాలనుకుంటున్నారని బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. సల్మాన్ సరోగసీ పద్ధతిలో తండ్రి కావాలనుకుంటున్నారట. ఈ పద్ధతిలో బాలీవుడ్‌లో షారూక్ దంపతులు, అమీర్ ఖాన్ దంపతులు, టాలీవుడ్ లో మంచు లక్ష్మి దంపతులు తల్లిదండ్రులయ్యారు. అలాగే సింగిల్‌గా ఉండే కరణ్ జోహార్ 2017లో సరోగసీ పద్ధతిలో కవలలకు తండ్రి కాగా, ఏక్తాకపూర్ 2019లో ఓ బాబుకు తల్లిగా మారింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ లిస్టులో చేరిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
previous post
next post