ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ మూవీలో క్రాక్ శృతి హాసన్ హీరోయిన్. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. అయితే.. తాజాగా సలార్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ చాలా వైల్డ్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా తమిళ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తున్నారు. పక్కా యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని హంబోలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post