telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడికి నో చెప్పిన సాయి పల్లవి ?

Sai-pallavi

“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. అలాగే ఓ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు, ఓ బడా నిర్మాత కలిసి తీయబోయే సినిమా ఆఫర్‌ను సాయిపల్లవి తిరస్కరించిందట. ఈ ఏడాది మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ స్క్రిప్టుతో రెడీగా ఉన్నారు. అయితే వెంకీ, వరుణ్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో అనిల్ ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకోగా దిల్ రాజు నిర్మించేందుకు ముందుకొచ్చారట. ఈ పాత్రకు సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

Related posts