telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు… సాయిపల్లవి ఫైర్

Sai-pallavi

తమిళనాడులో జరిగిన దారుణమైన ఘటనపై సాయిపల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ దారుణమైన ఘటన విషయానికొస్తే… తమిళనాడు రాష్ట్రం పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన జయప్రియ అనే ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతుంది. జూలై ఒకటో తేదీ సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. రాత్రి అయినా తిరిగిరాలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా అమ్మాయి ఆచూకీ దొరకకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామం చివర… ముళ్ల పొదళ్లలో పాపను గుర్తించారు. పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. ఈ ఘటన పై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై సాయి పల్లవి కూడా ఆవేదన వ్యక్తం చేసారు. “మానవజాతిపై విశ్వాసం నశిస్తుంది. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారు. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. గుర్తించబడని మరియు రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఏం జరుగుతోంది ? ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విషయాలు తెలియజెప్పేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోంది” అని సాయి పల్లవి ఫైర్ అయ్యింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts