“బాహుబలి” చిత్రంతో అంతర్జాతీయంగా ప్రభాస్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం “సాహో” ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో టీజర్‌ను జూన్ 13న (గురువారం) ఉదయం 11.30 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ “సాహో”లోని సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందజేశారు. యాక్షన్ సన్నివేశంలో బైక్‌పై వెళ్తున్న ప్రభాస్ ఫోటోను షేర్ చేశారు. దీంతో పాటు టీజర్ విడుదలను ఉద్దేశిస్తూ తన సందేశాన్ని ట్వీట్ చేశారు. “హే డార్లింగ్స్.. ఒకే ఒక్క రోజు ఉంది. ‘సాహో’తో ప్రపంచవ్యాప్తంగా రైడ్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?” అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు.
“మహానాయకుడు”పై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు