telugu navyamedia
సినిమా వార్తలు

“షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2” రికార్డుల మోత

shades of saaho tomorrow as on sradda

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం చాలావరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం నుంచి ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1″ అంటూ గతంలో విడుదల చేసిన వీడియోతో ప్రేక్షకుల్లో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2” పేరుతో శ్రద్ధాకపూర్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది.

ఈ వీడియోను విడుదల చేసిన 24 గంటల్లోనే 12 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో 24 గంటల్లోనే అత్యధికంగా 79 మిలియన్ల మందికి చేరింది. అదే 24 గంటల్లో 2.9 మిలియన్లకి పైగా లైక్స్ ను సాధించింది ఈ వీడియో. 24 గంటల్లోనే భారీ స్థాయిలో వ్యూస్ ను, లైక్స్ ను రాబట్టిన మేకింగ్ వీడియోగా “సాహో” సరికొత్త రికార్డును సృష్టించింది. ఆగష్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts