telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ తో కార్తీక్ ఆర్యన్ బ్రేకప్ ?

Karthik

ఇప్పుడు బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు కార్తిక్ ఆర్యన్. ఈ క్రేజీ హీరోను ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సారా ప్రేమించేసింది. తరువాత ఇద్దరూ కలసి అప్పుడప్పుడు కనిపిస్తుండడంతో బాలీవుడ్ మీడియాలో గాసిప్పులు ఓ రేంజ్ లో విన్పించాయి. అయితే ఇప్పుడు వీరి ప్రేమకు బ్రేకప్ పడినట్టుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ‘దోస్తానా 2’లో నటిస్తున్నాడు. ఇందులో క్యూటీ బ్యూటీ జాన్వీ కపూర్ రొమాంటిక్ స్టార్ సరసన ఆడి పాడుతోంది. సెట్స్ లో కార్తీక్ తో జాన్వీ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఇద్దరూ కలసి రకరకాల ఈవెంట్స్ లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తోన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోండటం విశేషం. కెరీర్ పరంగా ఇటు కార్తీక్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోండగా, అటు జాన్వీ కూడా వరుస ఆఫర్స్ ని దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి సమయంలో ఈ కొత్త జంట పై ప్రేమ కబుర్లు వినిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మరి వీరి దోస్తీ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Related posts