telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంఘాలు కార్మికుల హక్కుల కోసమే: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చాలా ఆరోపణలు చేశారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, అక్కడ ఏం జరగుతుందో ఎవరూ చెప్పలేరని కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి ఘాటుగా స్పందించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విషయంలో నెరవేర్చిన డిమాండ్లను చులకన చేసి మాట్లాడడం సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారని ఆయన తెలిపారు. సంఘాలు కార్మికుల హక్కుల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. దూర ప్రాంతాల్లో తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయని వివరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Related posts