telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దాదాపు 9 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్‌ చేసిన రిజ‌ర్వ్ బ్యాంక్…

Reserve Bank of India RBI

ప్రపంచాన్ని వణికించిన కరోనా వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా అందరిపై తీవ్రప్రభావం పడింది… జీతాలు లేక బతుకుబండిని లాగడమే కష్టం అయ్యింది.. ఇక, ఈఎంఐలు, లోన్ల పరిస్థితి సరేసరి… ప్రజలు లోన్లు కట్టకపోవడంతో.. ఆ భారం బ్యాంకులపై పడింది. ఈ ఏడాది ఇలా ఉంటే.. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులకు లోన్లు ఎగవేసిన మొత్తం కూడా భారీగా ఉందే.. ఈ నేపథ్యంలో.. గ‌త పదేళ్లలో భారతీయ బ్యాంకులకు చెందిన రూ.8,83,168 కోట్ల రుణాలను ర‌ద్దు (రైట్ ఆఫ్‌) చేస్తున్నట్టు ప్రకటించింది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇక, ఈ మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఏకంగా రూ.6,67,345 కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేసింది.. 2010 నుంచి ర‌ద్దు చేసిన రుణాల్లో ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల వాటా 76 శాతం ఉండగా.. ప్రైవేట్ బ్యాంకులు రూ.1,93,033 కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేసినట్టు, విదేశీ బ్యాంకులు రూ.22,790 కోట్ల రుణాలు చేశాయని ఆర్బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ లోన్లు రద్దు చేయం ఏంటి? అనే డౌట్ రావొద్దు.. అప్పు తీసుకున్న వ్య‌క్తి లేదా సంస్థ తిరిగి చెల్లించే అవ‌కాశాలు దాదాపు లేన‌ప్పుడు బ్యాంక్‌లు లోన్ల‌ను రైట్ ఆఫ్ చేస్తాయి. అంటే.. వసూలు చేయడం సాధ్యంకాక బ్యాంకులు చేతులు ఎత్తేశాయన్నమాట. అయితే దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .52,362 కోట్ల రుణాలను ఎత్తివేసింది.

Related posts