telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో షెడ్యూల్ ప్రారంబిభించిన ఆర్‌ఆర్‌ఆర్‌…

RRR

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ. ఈ చిత్రం కోసం ఓ చిన్న షెడ్యూల్ ను మహారాష్ట్రంలోని మహాబలేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. ఇక్కడి ప్రకృతి అందాల మధ్య కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లు తీసినట్టు తెలుస్తోంది. చుట్టూపక్కల అంతా కూడా అందంగా కనిపిస్తుందంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్విట్టర్ వీడియో చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మరో హీరోయిన్ కూడా ఉంది. శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రపోషిస్తుంది. ఈ సినిమాలో శ్రియ పాత్ర చిన్నదేనని తెలుస్తుంది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తుంది ఈ భామ.

Related posts