telugu navyamedia
సినిమా వార్తలు

ఆస‌క్తిరేపుతున్న‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా న‌టిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ( రణం రౌద్రం రుధిరం ). దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్​ఆర్​ఆర్’​ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్స్ విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి.

RRR Movie: Get Ready For An Awesome Surprise Tomorrow

గ్రాండ్ విజువల్స్‌ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇద్దరు హీరోలు తమదైన నటనతో పోటాపోటీగా నటించారు. ఈ 45 సెకన్ల వీడియోలో సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి. భారీ యాక్షన్‌తో నిండిన గ్రాండ్ విజువల్స్‌ కట్టిపడేస్తున్నాయి. నటీనటులు భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం హైలెట్ గా నిలిచాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్… ఇలా సినిమాలోని ప్రతి ముఖ్యమైన పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

ఈ సినిమాను 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం వ‌చ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.

Related posts