telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” టైటిల్ ?

RRR
యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 350 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లో కూడా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీయార్ కొమురం భీమ్‌గా న‌టిస్తున్నారు. చెర్రీ స‌ర‌స‌న హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టీమ‌ణి ఆలియా భ‌ట్‌ను తీసుకున్నారు. ఎన్టీయార్ స‌ర‌స‌న హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.
ఈ సినిమా టైటిల్ ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌రారు కాలేదు. ప్రారంభం నుంచి “ఆర్ఆర్ఆర్‌” అనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్‌`కు స‌రిగ్గా స‌రిపోయే ఎబ్రివేష‌న్‌ను పంపించాల్సిందిగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వివిధ భాష‌ల‌కు చెందిన అభిమానులు “ఆర్ఆర్ఆర్‌”కు స‌రిపోయే విధంగా త‌మ‌కు తోచిన ఎబ్రివేష‌న్‌ల‌ను పంపిస్తున్నారు. “ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం”, “రాజ్యం ర‌ణం ర‌క్తం”, “రాముడు రుద్రుడు రణ‌రంగం”, “రామ రాజ్య ర‌క్ష‌క‌” ఇలా ఇప్ప‌టికే ఎంతో మంది పంపించిన వాటిని “ఆర్ఆర్ఆర్‌” చిత్రబృందం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “అన్ని భాష‌ల నుంచి `ఆర్ఆర్ఆర్‌`కు సంబంధించిన ఎబ్రివేష‌న్స్ వెల్లువ‌లా వ‌చ్చిప‌డుతున్నాయి. కొన్ని ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కొన్ని భావ‌యుక్తంగా ఉన్నాయి. కొన్ని ఆలోచింప‌జేసివిగా ఉన్నాయి. ఇంకా పంపించండి. ఎవ‌రికి తెలుసు.. మీరు పంపించేదే `ఆర్ఆర్ఆర్‌` అస‌లు టైటిల్ అవుతుందేమో” అని ట్వీట్ చేశారు.

Related posts