ఐపీఎల్ 2020 లో ఈ రోజు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో గైల్ (99) పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చేధనను మంచిగానే ఆరంభించింది. జట్టులో ఓపెనర్ బెన్ స్టోక్స్ (50) పరుగులు చేసాడు. కానీ ఆ అతను ఔట్ అయిన తర్వాత సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. సంజు శాంసన్, కెప్టెన్ స్మిత్ బ్యాట్ జులిపించడం తో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖరారు చేసుకుంది. 17 .3 ఓవర్లలో 186 -3 పరుగులు సాధించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
previous post