telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో రికార్డును సొంతం చేసుకున్న “రౌడీబేబీ”

Maari-2

“ప్రేమమ్”తో మలయాళంలోనూ, “ఫిదా”తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకుంది. ఈ రెండు భాషల్లోనూ నాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి తమిళనాట మాత్రం నిరాశే ఎదురయింది. తొలి చిత్రం “దియా”, మలి చిత్రం “మారి-2”, మూడో చిత్రం “ఎన్జీకే” డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే `రౌడీబేబి` పాట రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళ హీరో ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన `మారి-2`లోని ఈ పాట అందర్నీ అలరించింది. ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్‌లకు అందరూ ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగింది. భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సాంగ్ దూసుకుపోతోందని బిల్‌బోర్డ్ సర్వే సంస్థ తాజాగా ప్రకటించింది. యూట్యూబ్‌లో ఈ పాట 715 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన ఏడో పాటగా `రౌడీబేబి` నిలిచింది. లిరిక్స్, ట్యూన్, డ్యాన్స్.. అన్నీ అద్భుతంగా కుదరడంతో దీని ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

Related posts