roudisheetar-naveen-yadav-f

తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదేనేమో…!

46

హైదరాబాద్ లో నవీన్ యాదవ్ అనే రౌడీషీటర్ హల్ చల్ చేస్తున్నాడు, అల్వాల్ లో ఒక షాపు యజమానిని మామూళ్ల కోసం బెదిరించగా నిరాకరించిన షాపు యజమానిని బెదిరించాడు, షాపు పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, అయితే అది కాస్త బూమ్ రాంగ్ గా మారి రౌడీ షీటర్ కు మంటలంటుకున్నాయి. దీనితో తీవ్రంగా గాయపడిన నవీన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు.

వివరాల ప్రకారం అల్వాల్ నగరంలో శ్యామ్ అనే వ్యక్తి లైటింగ్ అండ్ సౌండింగ్ సిస్టం అనే షాపును నిర్వరిస్తున్నాడు, అతడిని తరచు మామూళ్లకోసం డిమాండ్ చేసేవాడని , తాజాగా 10రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో షాప్ యజమాని నిరాకరించగా, పెట్రోల్ పోసి షాప్ కు నిప్పంటించాడు నవీన్ యాదవ్. నిప్పంటిస్తున్న సమయంలో షాప్ లో ఉన్న బ్యాటరీ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నవీన్ కు అంటుకున్నాయి. కాలిన శరీరంతో ఆసుపత్రిలో చేరిన నవీన్ కు వైద్యులు చికిత్స చేస్తున్నారు, పరిస్థితి విషమంగా ఉందని తెలుపుతున్నారు.

shop-is-on-fire

షాపు మంటల్లో పూర్తిగా దగ్దమైంది, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు, భారీగా ఆస్థి నష్టం వాటిల్లడంతో షాపు యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు, స్థానికుల సహకారంతో పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

శ్యామ్ అనే షాపు యజమాని తో పాటు ఇంకా చాలామందిని చిన్నా చితకా షాపు యజమానులు బెదిరించి మామూళ్లను వసులు చేస్తాడని, అంతే కాకుండా అక్రమంగా అందరిపై చేయి చేసుకుంటాడని అతన్ని చూసి బయపడాలని అతని వాళ్ల చాలా ప్రమాదం ఉందని, రాజకీయ అండదండలు ఉన్నందుకే ఇంతగా రెచ్చిపోతున్నాడని స్థానికులు వాపోతున్నారు.