telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ వైఖరి కారణంగా మండలి విలువలు దెబ్బతిన్నాయి: రోజా

roja ycp mla

తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా ఆయన వ్యవహరించేలా చంద్రబాబు చూశారని రోజా ఆరోపించారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ ఇలా అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఆ సభ ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ఓ రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా చంద్రబాబు, ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు న్యాయ రాజధానిని పెడతామని చెబుతుంటే, అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే ఉద్యమాన్ని లేవదీశారని అన్నారు.

Related posts