ఇటలీకి చెందిన రాబర్ట్ టోన్నిజో అనే వ్యక్తి మార్చి నెలలో కేరళ పర్యటనకు వచ్చాడు. మార్చి 13న అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందించిన చికిత్సతో టొనిజ్జో సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నాడు. మార్చి 26న కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ రాబర్ట్‌ను ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రాబర్ట్‌ను నిన్న డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా రాబర్ట్ మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను. కేరళ డాక్టర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మళ్లీ కేరళకు వస్తాను అని రాబర్ట్ పేర్కొన్నారు. కేరళ తనకు తన ఇంటి లాంటిదని చెప్పాడు. కేరళ అత్యంత సురక్షిత ప్రాంతమని, ఇప్పుడు తాను ఇటలీకి వెళ్తున్నానని, తప్పకుండా మళ్లీ ఇక్కడికి తిరిగి వస్తాను అని రాబర్ట్ తెలిపాడు.