road on a dog sleeping at that road

ఇప్పుడు కుక్క…రేపు మనుషులనేనా…?

40

మనిషి సాటి మనిషినే పాపం అనే రోజులు లేని ఈ కాలంలో జీవ హింస మహాపాపం…అన్నది ఎవరు పట్టించుకుంటారు… దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా రోడ్డుపై ఆదమరిచి నిద్రిస్తున్న ఓ శునకం పై రోడ్డు వేసేశారు. ఈ రోడ్డు వేయటంపై స్థానికంగా ఆగ్రహావేశాలకు కూడా లోనయ్యారట. వేసేంతవరకు వేస్తున్నట్టే తెలియలేదని ఆయా కాంట్రాక్టర్ లు చెప్పుకొచ్చి మొత్తానికి గండం గట్టెక్కారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఫూల్ సయ్యద్ క్రాస్ నుండి సర్క్యూట్ హౌస్ వరకు తాజ్మహల్ మీదుగా రోడ్ నిర్మాణం సాగుతుండగా, సదరు కాంట్రాక్టర్ అక్కడ ఒక ప్రాణి ఉందని కూడా చూసుకోకుండా రోడ్డు నిర్మాణంలో నిమగ్నమయ్యారు. తీరా ఆ ప్రాణి పై రోడ్డు వేశాకగాని మేలుకోలేదు కాంట్రాక్టర్. ఈ వీడియో ఎవరో తీసి దానిని సామజిక మాధ్యమంలో పెట్టారు, అది ఇప్పుడు వైరల్ అయ్యింది. అయినా ఈమధ్య ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్మార్ట్ మొబైల్ తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు తప్ప వెళ్లి కాపాడే ప్రయత్నం చేయటం మరిచిపోతున్నారు. మరిచిపోయేదేముందిలే ఇంతక ముందు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అక్కడే నుంచొని ప్రేక్షకుడిగా చూసేవారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో అందరికి చూపిస్తున్నారు, అదే మనం చెందిన అభివృద్ధి.

ఈ విషయం తెలుసుకున్న జంతు సంరక్షణ వారు పెద్ద ఆందోళనకు దిగారట, కానీ అప్పటికే ఆ కుక్క మృతదేహాన్ని అక్కడినుండి తీసేశారు. ఈ దారుణానికి పాల్పడిన సదరు కంపెనీపై పిర్యాదు నమోదుచేసినట్టు సామజిక కార్యకర్త తెలిపారు. ఈ ఘనతతో ఆగ్రా వాసులు ఆందోళనకు దిగారు.