ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. వినుకొండ మండలం శివాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఓ మినీ లారీ టైరు పంక్చర్ అయింది. దీంతో రోడ్డు పక్కన ఆపి ఆ లారీకి పంక్చర్ వేస్తుండగా.. అటు నుంచి వస్తున్న లారీ.. మినీ లారీని ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
previous post
పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్