rjd cannot devide

ఆర్.జె.డి ని విడగొట్టలేరు…

32

తేజస్వి యాదవ్ లాలూ చిన్న కొడుకు బీహార్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత, లాలూ లేని సమయంలో ‘ఆర్ జె డి ని’ సమర్ధంగా నడిపిస్తున్నాడనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉంది. నితీష్ లాంటి బలమైన నేతను ఢీకొని రెండు ఉపఎన్నికలో గెలిపించడంతో తేజస్వి భవిషత్ ‘సీఎం’ అని అంచనాలు పెరిగిపోయాయి.

గతంలో నితీష్ కేబినెట్ లో ‘డిప్యూటీ సీఎం’ గా పని చేసిన తేజస్వి ఇపుడు ప్రతిపక్ష నేతగా మరింత రాటు తేలాడు. ‘ఆర్ జె డి’ లోనే కాకుండా ఇతర పార్టీ నేతలతో కూడా సత్సంబంధాలు నిలుపుతూ అసలుసిసలు లాలూ వారసుడిగా ముద్ర వేసుకున్నారు. ఒక వైపు తేజస్వి ఎదుగుదల చూసి అందరు సంతోషిస్తుంటే లాలూ పెద్ద కొడుకు తేజప్రతాప్ కుమార్ లో మాత్రం తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన పెరిగిపోయింది.

ఇపుడు తేజప్రతాప్ చేసిన ట్వీట్ బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, “అస్థినా పురాన్ని అర్జునుడికె వదిలి ద్వారక వెళ్తున్నట్లు ” తేజప్రతాప్ చేసిన ట్వీట్ లాలూ కుటుంబంలో విబేధాలు మొదలైనాయి అన్న ప్రచారానికి ఆద్యం పోస్తుంది. పార్టీ పరంగా తేజప్రతాప్ కు ప్రాధాన్యత లభించడం లేదని ఆయన వర్గం అభిప్రాయపడుతున్నారు. కొందరు పార్టీ సీనియర్లు తేజప్రతాప్ ను లెక్కచేయడం లేదని పైగా కార్యకర్తలకు ఆయన కాల్ కి కూడా ఆన్సర్ చేయడంలేదని చెప్పడంతో తేజప్రతాప్ లో కోపం కట్లుతెంపుకుంది. కొందరు సీనియర్ నేతలు ఆర్ జె డి లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కలసికట్టుగా ఎన్ డి ఎ ను ఓడించాల్సిన తరుణంలో చీప్ ట్రిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్ జె డి లో వారసత్వం పై ముందు నుంచే ఒక క్లారిటీ ఉంది తేజప్రతాప్ కంటే తేజస్వి బెటర్ అని తెలిసి లాలూ అతనని ప్రోత్సహించారు. ఆయన బైట ఉన్నప్పుడే తేజస్వి ని డిప్యూటీ సీఎం చేశారు. లాలూ జైలు కు వెళ్ళాక కూడా తేజస్వినే చక్రం తిప్పుతున్నాడు, కానీ తనను మరి తీసిపారేస్తున్నారని తేజప్రతాప్ చాలా సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇపుడు తన ట్వీట్ పై దుమారం రేగడంతో తేజస్వి కి హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ఆర్ జె డి ని విడతీసే కుట్రలకు అవకాశం ఇచ్చేది లేదని చెప్తున్నారు తేజప్రతాప్.