sai-dharam-tej-and-rithika-

సాయి ధరమ్ తేజ్ తో రితిక రొమాన్స్…!?

14

వెంకటేష్ సరసన “గురు” సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రితికా సింగ్. ఈ చిత్రంలో రితికా సింగ్ నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్. అయితే ఆ తరువాత రితికా సింగ్ కు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం విచిత్రం.

అయితే తాజాగా టాలీవుడ్ లో రితికా మరో ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలిసింది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “చిత్రలహరి” అనే సినిమాలో రితికా సింగ్ కు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

రితికా సింగ్ స్వతహాగా బాక్సింగ్ ఛాంపియన్ కావడంతో ఇన్ని రోజులూ గ్లామర్ పై అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలుగు, తమిళంలో కలిపి నాలుగు చిత్రాల్లో నటించింది రితికా. అందులో ఒక్కటి కూడా గ్లామర్ పాత్ర కాకపోవడంతో అంతగా గ్లామర్ పై దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు జిమ్ కు వెళ్లి నాజూగ్గా మారిన ఈ అమ్మడికి ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ “చిత్రలహరి”లో ఆఫర్ వచ్చింది. మరి రితికా సింగ్ గ్లామర్ “చిత్రలహరి”కి ఏ మేరకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందో చూడాలి.