telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ రిష‌బ్ పంత్‌

టీం ఇండియా కీపర్‌ రిషబ్‌ పంత్‌ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అటు మైదానంలోనూ, ఇటు డ్రెసింగ్‌ రూంలోనూ పంత్‌ అందరినీ అలరిస్తుంటాడు. అంతేకాదు.. ఉత్తరాంఖడ్‌ వరద బాధితుల కోసం ఇవాళ సహాసం చేసి మానవత్వాన్ని కూడా చాటుకున్నాడు పంత్‌. అలాంటి గొప్ప ఆటగాడు పంత్‌కు అరుదైన ఘనత దక్కింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును జనవరి నెలకుగాను రిషబ్‌ పంత్‌ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, ఐర్లాండ్‌ ప్లేయర్‌ పాల్‌ స్టిర్లింగ్‌లను వెనక్కి నెట్టాడు పంత్‌. జనవరిలో రిషబ్‌ పంత్‌ టీం ఇండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌ టెస్ట్‌లో 89 పరుగులు చేసిన పంత్‌.. టీంకు అద్వితీయమైన విజయాన్ని సాధించి పెట్టాడు. అంతకుముందు సిడ్నీ టెస్ట్‌లోనూ 97 పరుగులు చేసిన పంత్‌.. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగియడంలో తన వంతు పాత్ర పోషించాడు పంత్‌. ఈ రెండు టెస్టుల్లోనూ క్లిష్టమైన పరిస్థితుల్లో పంత్‌ ఆడిన తీరు అద్భుతమని కొనియాడింది ఐసీసీ.

Related posts