telugu navyamedia
సినిమా వార్తలు

బాక్సర్ ఈవాండర్‌ హోలీఫీల్డ్‌కు శిక్షణ ఇచ్చింది కేఏ పాల్ : వర్మ

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ రాజకీయ నేతలపై కూడా తనదైన స్టయిల్లో సెటైర్స్ వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కేఏ పాల్ కు సంబంధించిన మరో వీడియోను పోస్ట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. బాక్సర్ మైక్ టైసన్ ను మట్టి కరిపించిన ఈవాండర్‌ హోలీఫీల్డ్‌కు పాల్ శిక్షణ ఇచ్చాడని నేను ఒప్పుకుంటున్నా అంటూ ఆ వీడియోపై కామెంట్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ నిన్న నామినేషన్ వేసిన ఆనందంలో కారులో పంచ్ లు ఇస్తూ విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మీడియా కంటబడ్డారు. ఇంకేముంది నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ తమ కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు.

Related posts