telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగబాబు వల్ల చెర్రీని పోలీస్‌ బెల్ట్‌తో కొట్టిన చిరు…

chiru

రాంచరణ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా ఎనిమిది సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్‌ బెల్ట్‌తో చిరు, చెర్రీని కొట్టారట. ఈ విషయాన్ని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నా చిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే నాన్న నా మీద చేయి చేసుకున్నారు. నాకు ఎనిమిదేళ్ల వయస్సులో మా ఇంటి గేట్‌ వద్ద డ్రైవర్, సెక్యూరిటీ మాట్లాడుకోవడం నేను విన్నాను. వారు మాట్లాడిన వాటిలో చాలా వాటికి నాకు అర్థం తెలీదు. దాంతో ఇంట్లోకి వెళ్లి వాటికి అర్థమేంటని బాబాయి నాగబాబును అడిగాను. అదే సమయానికి నాన్న షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చారు. ఆ తరువాత బాబాయి నన్ను నాన్న రూమ్‌కు తీసుకెళ్లి.. వీడు కొన్ని అసభ్యకర మాటలు నేర్చుకున్నాడు అంటూ కంప్లైట్ ఇచ్చాడు. వెంటనే రూమ్‌లో నుంచి బాబాయిని పంపిన నాన్న మా తాత గిఫ్ట్‌గా ఇచ్చిన బెల్ట్‌తో నన్ను కొట్టారు. అవి మంచి మాటలు కాదని ఎప్పుడూ అలాంటివి మాట్లాడకని తరువాత చెప్పారు. ఈ ఘటన తరువాత నాగబాబు బాబాయితో నేను చాలా రోజుల వరకు మాట్లాడలేదు అని చెర్రీ తెలిపారు. ఇక తన తండ్రితో కూర్చొని మాట్లాడటానికి తాను సంశయిస్తుంటాను కానీ ఉపాసన మాత్రం ఎలాంటి భయం లేకుండా డైరక్ట్‌గా వెళ్లి మాట్లాడుతుంటుందని చెర్రీ తెలిపారు. తమ ఇంట్లో ఉపాసనకు తన తండ్రి మంచి స్నేహితుడని రామ్ చరణ్ వివరించారు. ram-charan-

Related posts