telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

IIT పాట్నాలో ఇంజనీరింగ్ సీటు సాధించిన తెలంగాణ గిరిజన యువతి కి రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.

తెలంగాణ గిరిజన యువతి ఐఐటీని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బడేవత్ మధులత, షెడ్యూల్డ్ తెగ (ST) కేటగిరీ కింద JEE 2024లో 824వ ర్యాంక్ సాధించి, IIT పాట్నాలో B Tech ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో సీటు పొందారు.

నగదు కొరత కారణంగా దాదాపు వ్యవసాయ పనుల్లో స్థిరపడింది.

మధులత పరిస్థితిపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన సీఎంవో వెంటనే విద్యార్థిని వివరాలు ఆరా తీసింది. తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మధులతకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.

పేదరికంతో ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులకు ఈ సాయం కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఎం సహాయంతో మధులత ఐఐటీ చదువుకు మార్గం సుగమమైంది.

పలువురు దాతలు కూడా విద్యార్థిని చదువుకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

“రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ, బాదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం నా దృష్టికి వచ్చింది.

పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు.

ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే (23 జూలై, 2024) తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది.

ఇకముందు కూడా తను ఇలాగే రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.

Related posts