నేడు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా పాలన సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన రెండేళ్లు పూర్తిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.
నిజాంలు, రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ అని చెప్పుకొచ్చారు. గడీల పాలనను ప్రజలు తరిమికొట్టారని ప్రస్తావించారు.
కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు.
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
‘మంచిరోజులు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్?. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మనల్ని ముంచే రోజులొస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టింది గుర్తులేదా?
కేసీఆర్ ఓడిపోయాకే ప్రజలకు మంచి జరిగిందని గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలనూ కలవలేదు. ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌కు ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లనూ కలుస్తున్నారు.
యువతకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్‌లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీను కేసీఆర్ పదేళ్లపాటు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. ఎస్ఎల్బీసీ ఆగిందని మామ, అల్లుడు డ్యాన్సులు చేస్తున్నారు.
ఎవరూ అడ్డుపడ్డా ఎస్‌ఎల్‌బీసీను పూర్తిచేసి తీరుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

