telugu navyamedia
రాజకీయ

జయలలిత మృతిపై ముగిసిన ఆర్ముగ స్వామి కమిషన్ విచారణ..590 పేజీలతో నివేదిక..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎట్టకేలకు విచారణ పూర్తైంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేప‌థ్యంలో ఆర్ముగ స్వామి కమిషన్‌ నివేదిక కీలకంగా మారింది.

సుధీర్ఘకాలంపాటు జయలలిత మృతిపై సుమారు ఐదేళ్ల విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తుది నివేదికను రూపొందించి.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు

2016 సెప్టెంబ‌ర్ 22వ తేదీన మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబ‌ర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో మాజీ జడ్జీ జస్టిస్‌ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. .

ఆరుముగ స్వామి కమిషన్ గత 5 సంవత్సరాలుగా వివిధ పార్టీలను విచారించింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. అటు కమిటీ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

జయలలిత మృతికి సంబంధించి 158 మందిని విచారించిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి.. 590 పేజీలతో కమిషన్‌ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్‌ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం.

Related posts