resignations of congress mls is possible or not

మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు సిద్ధమా..?

21

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల సభ్యతం రద్దు పోరాటం మలిదశకు చేరుకుంది, శాసన సభలో మండలి స్పీకర్ స్వామి గౌడ్ ఫై మైక్ విసిరి గాయ పరిచారు అన్న అభియోగంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను తెరాస ప్రభుత్వం రద్దు చేయించింది. తొలిదశలో కాంగ్రెస్ పార్టీ నేతలు సభ్యత్వాల రద్దు ఫై 48 గంటల దీక్షతో పాటు గవర్నర్ ని కలసి శాసన సభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడింది ఆ పార్టీ, రెండు సార్లు తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సభ్యత్వాలు రద్దైన ఎమ్మెల్యేలకు ఏమి చేయాలో తోచని పరిస్థితి, సభ్యత్వాలపై పార్టీ ప్రభుత్వం ఫై సరిగా పొరాడలేదు అన్న అంతర్గత చర్చల అభిప్రాయాలతో కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీ ల బృందం ఈ రోజు 11 గంటలకు శాసన సభాధిపతి ని కలసి రద్దైన ఎమ్మెల్యే ల శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరనున్నారు, పునరుద్ధరించని సందర్భంలో నిన్న సిఎల్పిపి నేత జానారెడ్డి నివాసం లో జరిగిన సమావేశంలో తీసుకున్న కార్యాచరణ మేరకు, సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. ఇందుకోసం పార్టీ తరపు న్యాయవాదులతో కసరత్తు జరిపారు, ఒకవేళ స్పీకర్ స్పందించని పక్షం లో ఈ వారంలోనే సుప్రీం లో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం, అదేవిధంగా రాష్ట్రపతి ని కలవడానికి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు సమాచారం త్వరలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభిస్తుందని ధీమాతో ఉన్నారు కాగ్రెస్ నాయకులు.

రాజ్యాంగపరంగా న్యాయం జరగని దృష్ట్యా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు, మళ్ళీ జరిగే బస్సు యాత్రలో ఈ అంశాన్ని గట్టిగా వ్యాఖ్యానించి ప్రజలోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన్నటు సమాచారం తద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఖమ్మం, అలంపూరులలో భారి బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించని యెడల పార్టీ లో చర్చలు జరుగుతున్న విధం గా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం అవుతారా లేదా వేచి చూడాలి.