శ్రీకాకుళం జిల్లావాసుల విహారయాత్ర ముప్పుతిప్పలు పెట్టించింది. సింధునది పుష్కరాలకోసం 120 మంది బయలుదేరి జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. సింధు పుష్కరాలకు వెళ్లకముందే చుక్కల కన్పిస్తున్నాయని శ్రీకాకుళం వాసులు లబోదిబోమంటున్నారు. ప్రయాణ సౌకర్యానికి, బసవసతికి ఒప్పందం కుదుర్చుకున్న ట్రావెల్స్ యాజమాన్యం పత్తాలేకుండా పోవడంతో శ్రీకాకుళం వాసులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ట్రావెల్స్ యాజమాన్యం శ్రీకాకుళం వాసులకు కట్రా కాంటినెంట్ హోటల్లో బసచేయమని సూచించింది. హోటల్ నుంచి బయలుదేరగానే యాత్రికులను హోటల్ యాజమాన్యం నిర్భందించింది. మనిషికి పదివేలరూపాయలచొప్పున చెల్లించి కదలాలని హోటల్ సిబ్బంది పట్టుబట్టారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో శ్రీకాకుళం వాసులు కొట్టుమిట్టాడుతున్నారు.