telugu navyamedia
సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్ పై రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం

Renu-Desai

“జబర్దస్త్” కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఒకవైపు బుల్లితెర షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నాడు సుధీర్. ఇక ఆయన హోస్టింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సీనియర్ నటి రేణు దేశాయ్ సుధీర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఓ ఛానెల్ నిర్వహిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ కు సుడిగాలి సుధీర్ హోస్ట్ కాగా, రేణు దేశాయ్ జడ్జ్. అక్కడే సుధీర్ కామెడీ టైమింగ్ గురించి తనకు తెలిసిందని, ఉదయభాను గారి తర్వాత అంతగా తాను ఫిదా అయిపోయింది సుధీర్‌కే అని చెబుతోంది రేణూ. ముఖ్యంగా ఆయన హోస్టింగ్ చేస్తుంటే షో మొత్తం అతడి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుందని, అంత కమాండ్ ఉన్న హోస్ట్స్ చాలా అరుదుగా ఉంటారంని, ముఖ్యంగా సుధీర్ కామెడీ టైమింగ్ చూసినపుడు తాను కిందపడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటానని, అలాంటి వ్యక్తితో పని చేయడం కూడా సరదగా అనిపించిందని సుధీర్ పై ప్రశంసల వర్షం కురిపించింది రేణు దేశాయ్. మరోవైపు సుధీర్ హీరోగా ఓ సినిమా కూడా తెరకెక్కుతోంది. మరి సుధీర్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలడా ? అనేది చూడాలి.

Related posts