telugu navyamedia
వ్యాపార వార్తలు

భారతదేశపు కుబేరుడుగా అగ్ర‌స్థానంలో ముఖేష్ అంబానీ..

గ‌త కొన్నేళ్లుగా భారత కుబేరుల జాబితాలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న రిల‌య‌న్స్ సంస్థ‌ల అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా అగ్ర‌స్థానంలో నిలిచిన‌ట్టు ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల గురించి సమాచారం అందించే ఫోర్బ్స్ భారత్ కు చెందినా 2021 సంవత్సరపు ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. వరుసగా 14వ సంవత్సరం కూడా భారతదేశపు ధనవంతుడిగా నిలిచారు. ముఖేష్ 2008 నుండి అత్యంత ధనవంతుల జాబితాలో ఆగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

Forbes India Rich List 2021: Mukesh Ambani to Gautam Adani to Cyrus Poonawalla | Meet top 100 riches

2021 జాబితా ప్ర‌కారం దేశంలోని మొత్తం ధ‌న‌వంతుల సంప‌ద రూ. 58.12 ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ట్టుగా పేర్కొన్న‌ది. ఇక ముఖేష్ అంబానీ 92.7 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, 74.8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో గౌత‌మ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. కోవిడ్‌కు వ్యాక్సిన్ ను ఇండియాలో త‌యారు చేస్తున్న సీర‌మ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైర‌స్ పూనావాలా 19 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఐదోవ స్థానంలో నిల‌వ‌డం విశేషం.

భారతదేశం కుటుంబం, స్టాక్ మార్కెట్, విశ్లేషకులు, నియంత్రణ సంస్థల నుండి పొందిన వాటా.. అదేవిధంగా ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ లిస్ట్ ను తయారు చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఫ్యామిలీ ఫార్చ్యూన్ ర్యాంకింగ్‌లో లిస్ట్ చేశారు. ప్రైవేట్ కంపెనీల వాల్యుయేషన్ పబ్లిక్ ట్రేడ్ కంపెనీల ఆధారంగా జరిగింది.

Related posts