telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ కు, దాదా సాహెబ్ ఫాల్కేకు ఉన్న అనుబంధం…!

Amitab Bachchan Tweet on RGV

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలు చేసిన ఈ అరుదైన నటుడికి ప్రతిష్ఠాత్మక “దాదాసాహెబ్‌ ఫాల్కే” అవార్డు దక్కడం విశేషం. బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌కు భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌కు విచిత్రమైన అనుబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం 1969లో 17వ జాతీయ చలన చిత్ర అవార్డుల నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. హీరోగా అమితాబ్ బచ్చన్ కెరీర్ స్టార్ట్ చేసిన 1969లోనే ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. అలా తన సినీ జీవితం ప్రారంభమైన యేడాదిలో మొదలైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అమితాబ్ బచ్చన్ తన సినీ జీవితం 50 యేళ్లు పూర్తైయిన యేడాదిలో అందుకోవడం విశేషం. ఈ అవార్డును హిందీ చిత్ర సీమ నుండి అందుకుంటున్న 32వ వ్యక్తి అమితాబ్. మిగతావారు ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు. ఈ రకంగా అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కేకు విచిత్రమైన బంధం ఏర్పడింది.

Related posts